![]() |
![]() |

'కేజీఎఫ్-2' సక్సెస్ తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఇండియాలో మారుమోగిపోతోంది. కేవలం మూడు సినిమాలతోనే ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. ప్రశాంత్ తో సినిమా చేయడానికి ఎందరో ఆసక్తి కనబరుస్తుంటే.. ఆయన మాత్రం టాలీవుడ్ స్టార్స్ తోనే వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తున్న ప్రశాంత్.. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నాడు. అయితే తారక్ తో చేయబోయే మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ చెప్పడం విశేషం.
పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న తారక్ తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే చేస్తున్నాడు. తన 30వ సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తుండగా.. 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాల మాస్ పోస్టర్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. కేవలం పోస్టర్స్ తోనే ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రశాంత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో 'NTR31'పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
'కేజీఎఫ్'తో తన దర్శకత్వ ప్రతిభ చూపించాడు ప్రశాంత్. యాక్షన్ ఎపిసోడ్స్, హీరో ఎలివేషన్స్ లో తనని కొట్టేవారు లేనంతగా తెరకెక్కించాడు. అలాంటి ప్రశాంత్ 'NTR31' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. "ఇది 20 సంవత్సరాల క్రితం నా మెదడులో ఉద్భవించిన ఆలోచన. భారీ స్థాయి సినిమా కావడంతో ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. ఎట్టకేలకు నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ను నా డ్రీమ్ హీరోతో చేసేందుకు రంగం సిద్ధమైంది" అంటూ తాజాగా 'NTR31' గురించి ప్రశాంత్ కామెంట్స్ చేశాడు. గతంలోనూ తాను తారక్ అభిమానినని ప్రశాంత్ చెప్పాడు. ఇప్పుడు ఎట్టకేలకు డ్రీమ్ హీరోతో డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ అనడంతో 'NTR31' ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
![]() |
![]() |