![]() |
![]() |

`పెళ్ళిచూపులు` (2016)తో కథానాయికగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది రీతూ వర్మ. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ని మూటగట్టుకోవడమే కాకుండా.. `ఉత్తమ నటి`గా `నంది` పురస్కారాన్ని సైతం అందుకుంది. అయితే, తెలుగునాట ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయిన రీతూ.. తమిళంలో మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు.. గత కొంతకాలంగా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది రీతూ వర్మ.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రీతూ చేతిలో ఏకంగా ఐదు చిత్రాలున్నాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ నే. వీటిలో నేచురల్ స్టార్ నానికి జోడీగా నటించిన తెలుగు చిత్రం `టక్ జగదీష్` విడుదలకు సిద్ధం కాగా.. యంగ్ హీరో నాగశౌర్యతో చేస్తున్న `వరుడు కావలెను` షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇక శర్వానంద్ తో చేస్తున్న బైలింగ్వల్ మూవీ `ఒకే ఒక జీవితం` (తెలుగు టైటిల్) కూడా ఇదే ఏడాదిలో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. అలాగే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్న `ధ్రువ నక్షత్రం` కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక రీసెంట్ గా `నిన్నిలా నిన్నిలా` తరువాత కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో మరో కొత్త చిత్రానికి కమిట్ అయింది రీతూ. ఇందులో రీతూతో పాటు `ఆకాశం నీ హద్దురా` ఫేమ్ అపర్ణ బాలమురళి, శివాత్మిక కూడా నాయికలుగా నటిస్తుండడం విశేషం.
మొత్తమ్మీద.. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది రీతూ వర్మ.
![]() |
![]() |