![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ విజయ్, `బుట్టబొమ్మ` పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం `బీస్ట్`. `కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తుండగా.. జానీ మాస్టర్ నృత్యాలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తదుపరి షెడ్యూల్ కి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. `బీస్ట్` చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయ్ ప్రీవియస్ పొంగల్ బ్లాక్ బస్టర్ `మాస్టర్` విడుదలైన జనవరి 13నే `బీస్ట్`ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. మరి.. `మాస్టర్` సెంటిమెంట్ రిపీట్ అయి.. `బీస్ట్` కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టిస్తుందేమో చూడాలి.
కాగా, `బీస్ట్` తరువాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో విజయ్ ఓ పాన్-ఇండియా మూవీ చేయనున్నాడు. దీన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.
![]() |
![]() |