![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ కెప్టెన్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ భారీ బడ్జెట్ మూవీ.. థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని అందించనున్నారని సమాచారం. అదే గనుక నిజమైతే.. `రంగస్థలం` (2018) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత చరణ్ కాంబినేషన్ లో రత్నవేలు చేయబోయే చిత్రం ఇదే అవుతుంది. అలాగే `ఎందిరన్` (2010) వంటి బ్లాక్ బస్టర్ అనంతరం శంకర్ తో జట్టుకట్టే సినిమా కూడా ఇదే అయ్యే అవకాశముంది. వాస్తవానికి శంకర్ డైరెక్టోరియల్ `ఇండియన్ 2`కి రత్నవేలునే ఛాయాగ్రాహకుడు. అయితే, ఆ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం హోల్డ్ లో ఉండడంతో.. చరణ్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించబోతున్నారట రత్నవేలు. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీలో రత్నవేలు ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
అన్నట్టు.. `దిల్` రాజు బేనర్ లో `ఆర్య` (2004) వంటి బ్లాక్ బస్టర్ తరువాత రత్నవేలు పనిచేయబోయే సినిమా కూడా ఇదే కాబోతోంది.
![]() |
![]() |