![]() |
![]() |

సినీ నిర్మాత సి.కళ్యాణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. భూవివాదం విషయంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
అమెరికాలో డాక్టర్ గా పని చేస్తున్న స్వరూప్ అనే వ్యక్తి 1985లో షేక్ పేటలో ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పటి నుంచి నారాయణమూర్తి ఆస్థలంలో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నారు. అయితే సోమవారం సాయంత్రం షరూఫ్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు ఆర్గానిక్ స్టోర్ కు వెళ్లి.. కళ్యాణ్ పంపించారని చెప్పి.. స్టోర్‌కు తాళం వేశారు. స్టోర్ యజమాని, స్వరూప్ సోదరుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కళ్యాణ్ తో పాటు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
గతంలోనూ సి. కళ్యాణ్ పై భూ వివాదం విషయంలో ఆరోపణలు వచ్చాయి. కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి తాజా వివాదంపై కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |