![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందుతున్న సినిమా కాగా.. మరొకటి పిరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న `హరిహర వీరమల్లు`. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ రెండు భారీ బడ్జెట్ మూవీస్.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ కి ముస్తాబవుతున్నాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాల షూటింగ్.. ఒకే లోకేషన్ లో వేర్వేరు సెట్స్ లో జరుగనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కి సంబంధించి ప్రస్తుతం పోలీస్ సెట్ నిర్మాణం జరుగుతుండగా.. అదే లోకేషన్ లో `హరిహర వీరమల్లు`కు సంబంధించి చారిత్రక ఆగ్రా సెట్ ని రూపొందిస్తున్నారట. ఈ రెండు సెట్స్ కూడా భారీ బడ్జెట్ తోనే తయారవుతుండడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమాల తాజా షెడ్యూల్స్ లో పవన్ పాల్గొనబోతున్నారు.
కాగా, `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. `హరిహర వీరమల్లు`కి వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ డైరెక్టర్. 2022లో ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
![]() |
![]() |