![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ 'సూర్య' హీరోగా 'సుధా కొంగర' దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ మూవీ 'శూరరై పోట్రు'. ఈ సినిమా 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి విశేష ఆదరణ లభించింది. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.
'శూరరై పోట్రు' మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంలో సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగరనే బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. సూర్య, జ్యోతిక, రాజశేఖర్ పాండియన్.. అబన్‌డంతియ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి బాలీవుడ్‌లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
'శూరరై పోట్రు' రీమేక్ లో సూర్య పాత్రను పోషించడానికి బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించనున్నట్టు గుసగుసలు వినిపించాయి. మరి ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తారా లేక వేరే హీరో నటిస్తారో చూడాలి.
![]() |
![]() |