![]() |
![]() |

సంక్రాంతికి రిలీజైన `క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ.. ఈ వేసవిలో `ఖిలాడి`గా సందడి చేయబోతున్నారు. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మే 28న `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `ఖిలాడి` విడుదలయ్యేలోపే రవితేజ తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించబోతున్నారని సమాచారం. `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన డైరెక్ట్ చేయనున్న ఈ కామిక్ ఎంటర్ టైనర్.. మే ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళుతుందని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని టాక్. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ కోసం రవితేజ రూ. 16 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటున్నారని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. రాబోయే చిత్రాలతోనూ రవితేజ విజయపరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |