![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియడ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఆకర్షణీయమైన పాత్రలో బాలీవుడ్ భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్ దర్శనమివ్వనుంది. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో పవన్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. గండికోట సంస్థానం నేపథ్యంలో ఈ దృశ్యాలు వస్తాయని.. ఇందుకోసం ఓ భారీ సంస్థానం సెట్ ని సిద్ధం చేశారని సమాచారం. అంతేకాదు.. ఈ సెట్ సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
మరి.. పవన్ - క్రిష్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 2022 సంక్రాంతికి ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదల కానుందని టాక్.
![]() |
![]() |