![]() |
![]() |

`ఎక్కడికి పోతావు చిన్నవాడా`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. నందితా శ్వేత. ఆ చిత్రానికంటే ముందు కన్నడ, తమిళ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసింది నందిత. కాగా, `ఎక్కడికి పోతావు చిన్నవాడా` విజయం సాధించడంతో.. ఆపై `శ్రీనివాస కళ్యాణం`, `బ్లఫ్ మాస్టర్`, `ప్రేమకథా చిత్రమ్ 2`, `7`, `కల్కి` వంటి తెలుగు చిత్రాలతో సందడి చేసింది. అయితే, ఇవేవీ నందితకి సక్సెస్ ని అందించలేకపోయాయి.
ఇదిలా ఉంటే.. వరుసగా మూడు వారాల పాటు నందిత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు రిలీజ్ కి క్యూ కట్టడం వార్తల్లో నిలుస్తోంది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 19) తెలుగు చిత్రం `కపటధారి`లో సందడి చేసిన నందిత శ్వేత.. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 26) ఫిమేల్ సెంట్రిక్ మూవీ `అక్షర`తో పలకరించబోతోంది. ఆపై శుక్రవారం (మార్చి 5) తమిళ చిత్రం `నెంజమ్ మరప్పతిల్లై`తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తమ్మీద.. వరుసగా మూడు శుక్రవారాలు నందిత చిత్రాలు తెరపైకి రానుండడం వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి.
![]() |
![]() |