![]() |
![]() |

సుమంత్ సినిమా 'కపటధారి' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా మొదలైంది. కన్నడ హిట్ ఫిల్మ్ 'కవలుదారి'కి రీమేక్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కనిష్ఠ స్పందన వ్యక్తమవుతోంది. శుక్రవారం, ఫిబ్రవరి 19న నాలుగు సినిమాలు రిలీజ్ అయితే, వాటిలో 'కపటధారి' కలెక్షన్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి. కొన్ని షోలకు థియేటర్లలో నాలుగంకెల వసూళ్లు కూడా రాకపోవడం విచారకరం. అంతకంటే ఘోరం.. కొన్ని థియేటరల్లో కొన్ని షోలు జనం లేక క్యాన్సిల్ అవడం!
ఉదాహరణకు బొబ్బిలి, పాలకొండలో మ్యాట్నీ షోలు రద్దయ్యాయని తెలిసింది. శనివారం బొబ్బిలిలో మార్నింగ్ షోకు వచ్చిన వసూళ్లు నాలుగంకెలకు కూడా చేరుకోలేదు.
ఫిబ్రవరి 19న రిలీజైన నాలుగు సినిమాల్లో సుమంత్ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల కంటే తక్కువగానే అమ్ముడయ్యాయి. ప్రేక్షకుల కన్ను సైతం 'కపటధారి' మీద పడటం లేదు. ఉన్నంతలో వారు 'విశాల్ చక్ర' మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఓపెనింగ్స్‌తో పాటు, తర్వాత వస్తున్న వసూళ్లు కూడా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కపటధారి' వారం రోజుల దాకా థియేటర్లలో నిలదొక్కుకోవడం కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు.
![]() |
![]() |