![]() |
![]() |

నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందితా శ్వేత, అజయ్, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, అన్నపూర్ణ, ప్రవీణ్ తదితరులు
రచన దర్శకత్వం :సంజీవ్ మేగోటి
నిర్మాతలు : శంకర రావు,వెంకటేశ్వరావు, రాంబాబు యాదవ్
సంగీతం: సుధాకర్
డిఓపి: హరీష్
ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్
మొన్న అక్టోబర్ నెలలో వచ్చిన మధురపూడి గ్రామం అనే నేను మూవీతో ప్రేక్షకులని రంజింప చేసిన హీరో శివ కంఠంనేని.. అలాంటి ఆయన నుంచి రాఘవరెడ్డి మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆ మూవీ మీద మంచి ఆసక్తే ఏర్పడింది. పైగా టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉండటంతో మరింత క్యూరియాసిటీని రాఘవరెడ్డి కలిగించాడు.మరి ఈ రోజు విడుదల అయిన ఆ మూవీ ఎలా ఉందో చూద్దాం!
కథ
రాఘవరెడ్డి (శివ కంఠంనేని) (siva kantamneni) వైజాగ్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. పిల్లలకి పాఠాలు చెప్పటంతో పాటు వాళ్ళు చెడు మార్గాల వైపు వెళ్లకుండా సరైన దారిలో పెడుతుంటాడు. అంతే కాకుండా పోలీసులు కూడా కనిపెట్టలేని హత్యా నేరగాళ్ళని పట్టుకొని సమాజానికి తన వంతు సాయం చేస్తుంటాడు. రాఘవరెడ్డి (raghavareddy) ఉన్నకాలేజ్ లోకి హైదరాబాద్ కి చెందిన లక్కీ ( నందిత శ్వేత) ( nandita swetha) జాయిన్ అయ్యి క్రమశిక్షణ లేకుండా ఉంటు రాఘవరెడ్డి కి తలనొప్పిగా తయారవుతుంది.ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవకూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఒక రోజు లక్కీ కిడ్నాప్ కి గురవుతుంది దీంతో లక్కీ వాళ్ళ అమ్మ జానకి (రాశి ) (raasi)రాఘవరెడ్డి దగ్గరకి వచ్చి నువ్వే నా కూతురుని కిడ్నాప్ చేసావని అంటుంది. అసలు జానకి రాఘవరెడ్డి మీద ఎందుకు ఆ నిందవేసింది. ? అసలు లక్కీ ని కిడ్నాప్ చేసిందెవరు? ఒంటరిగా ఉంటున్న రాఘవరెడ్డి కి ఫ్యామిలీ ఉందా ? ఉంటే వాళ్ళు ఎవరు అనేదే ఈ చిత్ర కథ?
ఎనాలసిస్ :
మూవీ చూస్తున్నంత సేపు కథ మొత్తం ఓల్డ్ ఫార్మేట్ లో సాగుతుందని మూవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అనిపిస్తునే ఉంటుంది. కానీ నటీనటులు ప్రదర్శించిన నటనతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ నుంచి కొన్ని సార్లు బయటకి వస్తాడు. మూవీ స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్ చాలా మంచి పాయింట్ కానీ దర్శకుడు మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా తండ్రి కూతరు సెంటిమెంట్ కి వెళ్ళాడు . అలా వెళ్లకుండా తను బిగినింగ్ లో చెప్పిన పాయింట్ ని చివర దాకా ఉంచి ఆ ట్రావెలింగ్ కి తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ని అద్ది ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. అలాగే హీరో డ్రగ్స్ ని అరికట్టే సీన్స్ కనీసం కొన్ని అయినా ఉంటే సినిమా లుక్ మరోలా ఉండేది. కాకపోతే తండ్రి కూతురు సెంటిమెంట్ చాలా బాగుంది. 24 క్రాఫ్ట్స్ చాలా చక్కగా పనిచేసాయి. నిర్మాణ విలువలు సినిమాని కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:-
ఇక నటీ నటుల విషయానికి వస్తే శివ కంఠంనేని పిల్లలకి పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గా, సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక పౌరుడు గా సూపర్ గా చేసాడు.చాలా సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్ నటనని ప్రదర్శించాడు. నటన పరంగా తనకి నూటికి నూరు మార్కులు ఇవ్వవచ్చు. ఇక రాశి ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఒక రేంజ్ లో ప్రారంభించిందని చెప్పవచ్చు.హోమ్లీ క్యారక్టర్ లో సింప్లి సూపర్ గా చేసింది. ఇక నందితా శ్వేత విషయానికి వస్తే కాలేజ్ స్టూడెంట్ గా లక్కీ క్యారక్టర్ లో సూపర్ గా చేసింది. తెలంగాణ యాసలో మాట్లాడుతు ఆమె నటించిన విధానం సినిమా మొత్తానికే హైలెట్. ఇక అజయ్, రఘుబాబు , పోసాని, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, అజయ్ ఘోష్ లకి ఈ మూవీలో పోషించిన పాత్రలన్నీ కొట్టిన పిండే. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఫొటోగ్రఫీ సో సో గా ఉంది. ఇక చదివిందేమో ఏడవ క్లాస్ అయ్యింది డాక్టర్ అనే ఐటెం సాంగ్ అయితే ఒక ఊపు ఊపింది.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
కొన్ని సినిమాలు తెర మీద చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా బాగానే ఉంటాయి. ఈ రాఘవరెడ్డి కూడా అలాంటి కోవలోకే వచ్చే సినిమా.కానీ రోజు రోజుకి ప్రేక్షకుల అభిరుచి మారిపోతున్న వేళ ఇలాంటి సినిమాలు ఎంతవరకు ఆదరణ పొందుతాయో చూడాలి.
రేటింగ్ 2 .5 / 5
- అరుణా చలం
![]() |
![]() |