Home

»

Latest News

మంచు ఫ్యామిలీ మూడో తరం.. మరో వారసుడు వస్తున్నాడు!

Jan 5, 2024 2:17PM

మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వస్తోంది. మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మి సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు మూడో తరం కూడా సినీ ఎంట్రీ ఇస్తోంది. మంచు విష్ణు తనయుడు అవ్రామ్ 'కన్నప్ప'(Kannappa)తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న సినిమా ‘కన్నప్ప’. న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది కన్నప్ప టీం. తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్ (Mohanlal), ప్రభాస్ (Prabhas), మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించారు. ఇక ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు కన్నప్పతో ఎంట్రీ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 

విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని 'కన్నప్ప'తో మొదలుపెట్టారు. అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించాడు. "ఈ 'కన్నప్ప' సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది" అని విష్ణు చెప్పుకొచ్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com