![]() |
![]() |

`వర్షం` (2004), `డార్లింగ్` (2010) తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `రాధేశ్యామ్`. పదకొండేళ్ళ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే.. ఈ నెల 30న ఈ పిరియడ్ లవ్ సాగా థియేటర్స్ లో సందడి చేసి ఉండేది. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా విడుదల వాయిదా తప్పలేదు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ కెరీర్ లో మేలిమలుపు గా నిలిచిన `ఛత్రపతి` (2005).. ఏ తేదిన విడుదలయ్యిందో అదే రోజున `రాధేశ్యామ్`ని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. పదహారేళ్ళ తరువాత ప్రభాస్ మెమరబుల్ డేట్ కి రాబోతున్న `రాధేశ్యామ్` ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, `రాధేశ్యామ్`లో ప్రభాస్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటిస్తుండగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, మాలీవుడ్ స్టార్ జయరామ్, `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
![]() |
![]() |