Home

»

Latest News

చ‌ర‌ణ్‌తో కృతి రొమాన్స్?

Jul 19, 2021 3:33PM

`ఉప్పెన‌`తో తెలుగు కుర్ర‌కారుని ఫిదా చేసేసింది కృతి శెట్టి. ఈ సెన్సేష‌న‌ల్ డెబ్యూ త‌రువాత కృతి.. వ‌రుస చిత్రాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేచుర‌ల్ స్టార్ నానితో `శ్యామ్ సింగ రాయ్`, టాలెంటెడ్ హీరో సుధీర్ బాబుకి జంట‌గా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ స‌ర‌స‌న పేరు నిర్ణ‌యించ‌ని ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తోంది కృతి. ఈ చిత్రాల‌న్నింటిలోనూ ఒక‌దానితో ఒక‌టి పొంతన లేని పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంది మిస్ శెట్టి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కి ఓ భారీ బ‌డ్జెట్ మూవీలో సెకండ్ లీడ్ గా న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ని టాక్. మెయిన్ లీడ్ గా ఓ స్టార్ హీరోయిన్ న‌టించ‌నుండ‌గా.. సెకండ్ లీడ్ గా లేటెస్ట్ సెన్సేష‌న్ కృతిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వినికిడి. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబో మూవీలో కృతి ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.

మ‌రి.. `ఉప్పెన‌`లో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న మురిపించిన కృతి.. అదే కుటుంబానికి చెందిన చ‌ర‌ణ్ తోనూ అల‌రిస్తుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com