![]() |
![]() |

హిందీనాట ఘనవిజయం సాధించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ `అంధాధున్`.. తెలుగులో `మాస్ట్రో` పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. మాతృకలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రలో నితిన్ కనిపించనుండగా.. టబు ధరించిన వేషంలో తమన్నా, రాధికా ఆప్టే చేసిన క్యారెక్టర్ లో నభా నటేశ్ దర్శనమివ్వనున్నారు. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా `మాస్ట్రో`ని థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమ్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో `మాస్ట్రో` స్ట్రీమ్ కాబోతున్నట్లు ఇప్పటికే కథనాలు వచ్చాయి కూడా. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పంద్రాగస్టు కానుకగా ఆగస్టు 15న `మాస్ట్రో`ని స్ట్రీమ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే `మాస్ట్రో` స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ రానుంది. మరి.. ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న ఈ చిత్రం నితిన్ అభిమానులను ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
కాగా, `మాస్ట్రో`కి యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ బాణీలు అందించారు. `భీష్మ` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నితిన్, మహతి కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
![]() |
![]() |