![]() |
![]() |

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్' మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్ట్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేస్తూ.. పోస్టర్ ను రిలీజ్ చేసింది. నాగ చైతన్య 'మజిలీ' సినిమాతో దివ్యాంశ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రజీషాకు మాత్రం తెలుగులో ఇదే మొదటి సినిమా. మలయాళ సినిమాల్లో నటించి మెప్పించిన రజీషా.. రీసెంట్ గా 'కర్ణన్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు రవితేజ మూవీతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తుంది.
మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |