![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29 న గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే పునీత్ మరణించి ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఆ వార్త ఆయన మేనత్తకు తెలియదు. ఆమె వయస్సు, అనారోగ్యం దృష్ట్యా పునీత్ కుటుంబ సభ్యులు ఈ విషయం ఆమెకి చెప్పకుండా దాచి పెట్టారు.
పునీత్ మరణ వార్త ఇంకా ఆయన మేనత్త నాగమ్మకు తెలియదు. 90 ఏళ్ల నాగమ్మ.. పునీత్ తండ్రి రాజ్ కుమార్ సోదరి. వీరి కుటుంబంలో ఆమెనే పెద్ద. తన సోదరుడి పిల్లలను ఆమె తన సొంత పిల్లల్లా చూసుకునేవారు. ముఖ్యంగా ఆమెకి పునీత్ తో మంచి అనుబంధం ఉంది. పునీత్ మరణవార్త తెలిస్తే ఆమె తట్టుకోలేరని.. ఆమెకు కుటుంబసభ్యులు ఈ విషయం చెప్పలేదు.
కొన్నేళ్ల క్రితం పునీత్ పెద్దన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ గుండెపోటుకు గురైనప్పుడు.. నాగమ్మ తట్టుకోలేకపోయారు. ఆ షాక్‌తో ఆమె ఆసుపత్రిలో చేరారు. తన సోదరుడి పిల్లలకి ఏమైనా జరిగితే ఆమె తట్టుకోలేరు. అందుకే ఇప్పటికీ పునీత్ లేడనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నామని, ఆమె పునీత్ గురించి అడిగితే వేరే దేశంలో ఔట్ డోర్ షూట్ లో ఉన్నాడని చెబుతున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, పునీత్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' నేడు ఆయన జయంతి సందర్భంగా థియేటర్స్ లో విడుదలైంది. పునీత్ చివరి చిత్రం కావడంతో అభిమానులు, సాధారణ ప్రేక్షకులు థియేటర్స్ కి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ పునీత్ కి నివాళులు అర్పిస్తున్నారు.
![]() |
![]() |