![]() |
![]() |

మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ` వేసవిలో విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన చేతిలో `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` సినిమాలున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం (మెగా 154)లోనూ రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. `మెగా 154`లో రవితేజ స్పెషల్ రోల్ కేవలం యాక్షన్ కే పరిమితం కావడం లేదట. రొమాన్స్ కి కూడా స్కోప్ ఉందట. ఇందులో భాగంగానే.. రవితేజతో ఇప్పటివరకు జట్టుకట్టని ఓ హీరోయిన్ ని ఎంపిక చేశాడట బాబీ. ఆ కథానాయిక మరెవరో కాదు.. `మెంటల్ మదిలో`, `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అల వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్` చిత్రాల్లో ఎంటర్టైన్ చేసిన నివేదా పేతురాజ్. త్వరలోనే `మెగా 154`లో నివేదా పెతురాజ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. రవితేజ, నివేదా జోడీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Also Read: 'గాడ్‌ఫాదర్'లో నీ ప్రెజెన్స్ ఆడియెన్స్‌కు 'కిక్'నిస్తుంది.. సల్మాన్‌కు చిరు ఆహ్వానం!
కాగా, రానా - సాయిపల్లవి జంటగా నటించిన `విరాట పర్వం`లో నివేదా ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కాబోతోంది.
![]() |
![]() |