![]() |
![]() |

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'సర్కారు వారి పాట' నుంచి విడుదలైన మొదటి సాంగ్ 'కళావతి'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 90 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన ఈ సాంగ్ 100 మిలియన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక 'సర్కారు వారి పాట' రెండో సాంగ్ కి ముహూర్తం ఖరారైంది. 'పెన్నీ' అంటూ సాగే ఈ సాంగ్ ని మార్చి 20 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ని వదిలారు. పోస్టర్ స్టైలిష్ లుక్ లో మహేష్ ఆకట్టుకుంటున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |