Home  »  News  »  VIjay: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్ బీ చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన సూపర్ హిట్స్ ఇవే

Updated : May 6, 2026

 

తమిళ చిత్రసీమలో నేడు తిరుగులేని మాస్ హీరోగా వెలుగుతున్న విజయ్(Vijay)స్టార్ డమ్ వెనక   బలమైన పునాది ఉంది. ఆ పునాదిని నిర్మించడంలో లెజండ్రీ  నిర్మాత ఆర్‌.బి.చౌదరి(RB Choudary),ఆయన నిర్మాణ సంస్థ 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' కీ రోల్ పోషించాయి. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌ని ఒక పక్కా ప్లానింగ్‌తో స్టార్‌గా మార్చిన ఘనత వీరిదే.


విజయ్ తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో కెరీర్ మొదలైనప్పటికీ, ప్రారంభంలో  ఆశించిన విజయాలు దక్కలేదు. ఆ సమయంలో ఆర్‌.బి.చౌదరి విజయ్‌లోని స్పార్క్‌ని  గుర్తించి 'పూవే ఉనక్కాగా'  నిర్మించారు. విక్రమన్ దర్శకత్వంలో 1996 లో రాగా  విజయ్ కెరీర్‌ ని  మలుపు తిప్పింది. అప్పటివరకు కేవలం యాక్షన్ హీరోగా కనిపించిన విజయ్, ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. తెలుగులో జగపతి బాబు ఇదే సినిమాని శుభాకాంక్షలుగా చేసి హిట్ అందుకున్నాడు. సూపర్ గుడ్ నే నిర్మించింది

 లవ్ టుడే:  1997 లో రాగా  యువతలో విజయ్ క్రేజ్‌ని  అమాంతం పెంచేసింది. యూత్ లో ఎక్కడ చూసినా విజయ్ నామస్మరణే.  ఇదే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సుస్వాగతం గా చేసి అంతే ఫాలోయింగ్ ని పొందాడు. సూపర్ గుడ్ నే తెలుగులో కూడా నిర్మించింది

తుల్లాద మనముమ్ తుళ్లుమ్: 1999 లోనే వచ్చిన  ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కోలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ఇక విజయ్ అంటే ఒక బ్రాండ్ అనేలా చేసింది.  తెలుగులో నాగార్జున నువ్వు వస్తావని’ పేరుతో రీమేక్  చేసి తన ప్లాప్స్ కి అడ్డుకట్ట వేసుకున్నాడు.

షాజహాన్:  2001 లో రాగా మ్యూజికల్ హిట్‌గా నిలిచి, విజయ్ ని  యూత్ ఐకాన్‌గా మార్చింది.

తిరుపచి’ (2005) విజయ్ కి మాస్ ఇమేజ్ ని టన్నుల కొద్దీ వచ్చేలా చేసి వీరాభిమానులని తయారు చేసింది. పవన్ కల్యాణ్ తో  తెలుగులో ‘అన్నవరం’ గా  సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థే స్వయంగా నిర్మించింది.

Also read: Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీపైడిపల్లి మూవీ క్రేజీ అప్ డేట్.. విలన్ రేసులో ఇద్దరు స్టార్స్ 

చౌదరి గారికి కథల ఎంపికలో ప్రత్యేక శైలి ఉండేది. కేవలం భారీ బడ్జెట్ కాకుండా, భావోద్వేగాలు పుష్కలంగా ఉన్న కథలను విజయ్ కోసం ఎంచుకునేవారు. ముఖ్యంగా "పక్కింటి అబ్బాయి" అనే ఇమేజ్ నుండి "మాస్ హీరో" అనే ఇమేజ్ వైపు విజయ్ ప్రయాణించడానికి కావలసిన సరైన ప్లాట్‌ఫారమ్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్ అందించింది. వీరి కలయికలో వచ్చిన దాదాపు 6 ,7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. విజయ్ కెరీర్‌కి ఏ దశలో ఎలాంటి సినిమా కావాలో పక్కాగా అంచనా వేసి, దళపతి రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిన క్రెడిట్ ఆర్.బీ. చౌదరికే దక్కుతుంది. ఈ రోజు విజయ్ అనుభవిస్తున్న స్టార్‌డమ్ వెనుక సూపర్ గుడ్ ఫిల్మ్స్ వేసిన బలమైన పునాది ఉంది.

అలాంటి  లెజెండరీ విజయ్ ప్రమాణ స్వీకారం చూడకుండానే కారు యాక్సిడెంట్ లో  చనిపోవడం బాధాకరం. కానీ తన ఆత్మ మాత్రం విజయ్ ప్రమాణ స్వీకారం చూస్తూ మురిసిపోవడం ఖాయం.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.