![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK111' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, ప్రతి అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతోందని, అందులో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) మెరవనుందని వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నర్గీస్ ఫక్రీ చేయబోయే స్పెషల్ సాంగ్ కోసం మే 8 నుండి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. బాలకృష్ణ మార్క్ మాస్ స్టెప్పులు, నర్గీస్ ఫక్రీ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పాటను అత్యంత భారీ సెట్లలో, గ్రాండ్‌గా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. ఇప్పుడు నర్గీస్ ఫక్రీ వంటి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్యూటీతో స్పెషల్ సాంగ్ అంటే థియేటర్లలో రచ్చ ఖాయమని అర్థమవుతోంది.
'వీరసింహా రెడ్డి' తర్వాత బాలయ్య - గోపీచంద్ మలినేని మళ్లీ జతకట్టడం ఫ్యాన్స్‌కు పెద్ద పండగ అని చెప్పాలి. ఈ సినిమాలో తొలుత నయనతారను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆ స్థానంలో నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
![]() |
![]() |