![]() |
![]() |
.webp)
''పుష్ప' చిత్రంలో "తగ్గేదేలే" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. పాన్ ఇండియా షేకయింది. ఇప్పుడు ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule)పై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్’ యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘పుష్ప 2’ నుంచి కపుల్ సాంగ్ (The Couple Song) ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మేకింగ్ విజువల్స్‌తో ఈ కపుల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ‘నా సామి’ పాటను బీట్ చేసేలా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. "సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామి" అంటూ సాగిన ఈ పాటను ఐదు భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారని అర్థమవుతోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
![]() |
![]() |