![]() |
![]() |

తనను దారుణంగా మోసం చేసారని సినీనటుడు ఫ్యామిలీ స్టార్ జగపతిబాబు వాపోయారు.. తనతో యాడ్ షూట్ చేయించుకొని చెక్కు ఇచ్చారని ఆ చెక్కు బౌన్స్ అయ్యిందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలియచేస్తూ వీడియో ని రిలీజ్ చేశారు.. ఐతే తరుచు రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అని ప్రజలు గగ్గోలు పెట్టటం చూశాము.. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవ్వటం తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడేవాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.. ల్యాండ్ కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్త పడండి.
జగపతి బాబు తాను ఎవరు చేతిలో మోసపోయాడు అనే విషయాన్ని త్వరలో ఆధారాలతో సహ బయట పెడతానని తెలియచేసాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ మూవీలో కనిపించిన జగపతి బాబు... ఇప్పుడు సలార్ 2 ప్రాజెక్టులోనూ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
![]() |
![]() |