![]() |
![]() |
.webp)
రానున్న రోజుల్లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ (Janhvi kapoor)తెలుగు నాట టాప్ హీరోయిన్ అవ్వడం అనేది ఖాయం. ఎందుకంటే ఆమె లిస్ట్ లో ఎన్టీఆర్ (ntr) దేవర (devara)తో పాటు చరణ్ (charan) కొత్త మూవీలు ఉన్నాయి. మరికొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. జాన్వీ తాజాగా ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. ఎట్ ఏ టైం సోషల్ మీడియాలో జరిగిన డిస్కర్షన్ కూడా చర్చినీయాంశమయ్యింది.
జాన్వీ రీసెంట్ గా బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr and Mrs Mahi) అనే మూవీ చేసింది. మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. రాజ్ కుమార్ రావ్ హీరోగా చేస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో జాన్వీ మాట్లాడుతు ఇటీవల నా పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలని చదివాను. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాసారు. నేను రెండు మూడు ఇంటర్వ్యూ ల్లో చెప్పిన విషయాలని కలిపి ఒక వార్తగా రాసారు. దీంతో చాలా మంది నాకు పెళ్లి అని ఫిక్స్ అయ్యారు .కానీ నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా కెరీర్ పైనే ఉందని చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని రోజులుగా వినిపిస్తున్న జాన్వీ పెళ్లి న్యూస్ అబద్ధం అని అర్ధమయ్యింది
అదే టైంలో సోషల్ మీడియా వెబ్ సైట్ రెడిట్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది.వాళ్ళు వేసిన పలు ప్రశ్నలకి చాలా ఓపిగ్గా రిప్లై లు ఇచ్చింది. ఒక అభిమాని డేట్ కి వెళ్దామా..మంచి స్టోరీ అవుతుంది అని అడిగాడు. నువ్వు గొడ్డలి తో నరికి చంపేసే హంతుకుడివి అయితే పరిస్థితి ఏంటి అని రిప్లై ఇచ్చింది. రెడిట్ ని నా కంటే నా చెల్లెలు ఎక్కువ వాడుతుంది అని చెప్పుకొచ్చింది.పైగా నాకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని ఆయినా తన ద్వారానే తెలుసుకుంటానని ఎందుకంటే సోషల్ మీడియా అంటే తనకి భయమని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి జాన్వీ అభిమానులకి రిప్లై ఇచ్చినప్పుడు ఖుషి కపూర్ పక్కనే ఉండి ఉంటుంది. గొడ్డలి ఐడియా కూడా ఆమెదే అయ్యి ఉంటుందని నెటిజన్స్ అనుకుంటున్నారు.
![]() |
![]() |