![]() |
![]() |

సమ్మర్ సీజన్ లో సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్నికలు, ఐపీఎల్ దెబ్బకి సినిమాల సందడి పెద్దగా లేదు. చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. విడుదలైన కొన్ని సినిమాలు కూడా తేలిపోయాయి. దీంతో వేసవి అంతా దాదాపు సప్పగానే సాగింది. అయితే వేసవి ముగుస్తున్న సమయంలో కొన్ని సినిమాలు మేమున్నాం అంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈవారం మూడు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి.
మే 31న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari), 'గం గం గణేశా' (Gam Gam Ganesha), 'భజే వాయు వేగం' (Bhaje Vaayu Vegam) సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలు దేనికదే ప్రత్యేకం.
కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మాస్ జాతరలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం 'గం గం గణేశా'. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ ఫిల్మ్ పై మంచి అంచనాలే ఉన్నాయి.
గతేడాది 'బెదురులంక 2012'తో నవ్వులు పూయించిన కార్తికేయ.. ఇప్పుడు 'భజే వాయు వేగం' అనే యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
మరి మే 31న జరుగుతున్న ఈ ట్రయాంగిల్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
![]() |
![]() |