![]() |
![]() |
.webp)
థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు మిశ్రమ స్పందనలతో ముగుస్తాయి. అయితే అవే సినిమాలు ఓటీటీలోకి వస్తే మంచి హిట్ గా నిలుస్తాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మందికి చేరుతుంది. రాత్రి పూట ఒంటరిగా కూర్చొని ఏ పని చేయకుండా శ్రద్ధతో చూడాల్సిన కొన్ని అరుదైన సినిమాలు ఉంటాయి. అలాంటి వాటి లిస్ట్ లో ఇప్పుడు ఈ ' ఆరంభం' మూవీ చేరింది.
తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్టులతో రూపొందించిన ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం నటుడు మోహన్ భగత్ హీరోగా చేసాడు. తొలిపరిచయంగా సుప్రిత సత్యనారాయణ్ హీరోయిన్ గా నటించగా.. అర్జున్ రెడ్డి ఫేమ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య రావు పాత్రలో అర్జున్ రెడ్డి ఫేమ్ భూషణ్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్, సురభి ప్రభావతి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అసలేం ఉంది ఈ సినిమాలో ఓసారి చూసేద్దాం.
మిగిల్(మోహన్ భగత్) అనే వ్యక్తి జైలులో హత్యకేసు అనుభవిస్తుంటాడు. ఇక తెల్లవారుజామున అతనికి ఉరిశిక్ష ఉండగా.. జైలులో నుండి మాయమవుతాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉంటాయి. చుట్టూ గోడలు, ఫ్లోర్ అన్నీ అలానే ఉంటాయి కానీ మిగిల్ జైలు నుండి తప్పించుకుంటాడు. అసలెలా తప్పించుకున్నాడో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఇక ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదని ఇద్దరు డిటెక్టివ్ లని పిలిచి సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. అయితే జైలులో మిగిల్ కి క్లోజ్ ఫ్రెండ్ గా గణేష్(లక్ష్మణ్ మీసాలా) ఉంటాడు. అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిటెక్టివ్స్ కి డెజావు గురించి తెలుస్తుంది. అసలు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య రావు చేసే ప్రయోగాలు ఏంటి? డెజావుతో మిగిల్ ఏం చేశాడు? మిగిల్ జైలు నుండి ఎలా తప్పించుకున్నాడనేది మిగతా కథ. రీసెంట్ తెలుగు సినిమాలలో ఈ 'ఆరంభం' చూసిన వారికి బెస్ట్ థ్రిల్ ని ఇస్తుంది. అయితే ఈ సిమిమా చూడాలంటే .. ఏ పనులు చేయకూడదు. దిక్కులు కూడా చూడకూడదు. ఒక్కసారి కనెక్ట్ అయితే అసలు చివరిదాకా చూసేదాకా వదిలిపెట్టరు. సినిమా నిడివితో సంబంధం లేకుండా కంటెంట్ చూసుకుంటూ వెళ్తే అలా స్మూత్ గా సాగిపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరు ఊహించరు. గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని అలా కనెక్ట్ చేసేస్తుంది. ఈటీవీ విన్ లో ఉన్న ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వారు ఓసారి చూసేయ్యండి.
![]() |
![]() |