![]() |
![]() |

దూకుడు, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర.. ఈ మధ్య కొన్ని పరాజయాలను చూశారు. ముఖ్యంగా 2023లో విడుదలైన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాలతో అనిల్ సుంకర వందల కోట్లు నష్టపోయారని, ముఖ్యంగా భోళా శంకర్ దెబ్బకు ఫామ్ హౌస్ వంటి విలువైన ఆస్తులను అమ్ముకున్నారని ఆ సమయంలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ప్రచారాన్ని ఖండించారు అనిల్ సుంకర.
భోళా శంకర్ నష్టాల వల్ల ఫామ్ హౌస్ అమ్ముకున్నారన్న వార్తలపై అనిల్ సుంకర స్పందిస్తూ.. "అమ్మడానికి నాకసలు ఫామ్ హౌసే లేదు. కొందరు ఇడియట్స్ ఆ న్యూస్ క్రియేట్ చేశారు. రాజు గారి తోట అనే హోటల్ మాత్రమే నాకుంది. దానిని ఫామ్ హౌస్ అని క్రియేట్ చేసి, అది అమ్మానని కొందరు రాశారు. నిజానికి అది కూడా నేను అమ్మలేదు. కానీ, ఈ న్యూస్ చూసి నా సన్నిహితులు కూడా నిజమని నమ్మారు. ఆ సమయంలో చిరంజీవి గారు నాకెంతో సపోర్ట్ చేశారు. ఆయనను బ్యాడ్ చేయడం కోసమే కొందరు కావాలని ఇలాంటివి క్రియేట్ చేశారు." అన్నారు.
![]() |
![]() |