![]() |
![]() |

ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో థియేటర్లలో సందడి చేయనున్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఓజీ' విడుదలకు ఇంకా నెలరోజులే సమయముంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రం వాయిదా పడనుందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి తాజాగా మేకర్స్ చెక్ పెట్టారు. (Pawan Kalyan)
సెప్టెంబర్ 25నే 'ఓజీ' విడుదలవుతుందని, నెల రోజుల్లో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తుందని తాజాగా మేకర్స్ స్పష్టం చేశారు. అంతా లాక్ అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆగస్టు 29 నుండి యూఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ఖాయమని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. (OG Movie)
మేకర్స్ తాజా ప్రకటనతో 'ఓజీ' వాయిదా పడట్లేదని, ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 25నే విడుదలవుతుందని క్లారిటీ వచ్చేసింది.
![]() |
![]() |