![]() |
![]() |

విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ 'కింగ్‌డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ వి.పి ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం.. మంచి అంచనాలతో జూలై 31న థియేటర్లలో అడుగుపెట్టింది. కానీ, ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (Kingdom)
'కింగ్‌డమ్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది 'కింగ్‌డమ్'. ఆగస్టు 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి ఈ 'కింగ్‌డమ్' మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. (Kingdom On Netflix)
2018లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయ్ సక్సెస్ చూడలేదు. 'కింగ్‌డమ్'తో వరుసగా ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒక దానికి రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్టర్ కాగా.. మరో దానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు.

![]() |
![]() |