![]() |
![]() |

తమిళ అగ్రనటుల్లో 'జయం రవి'(Jayam Ravi)కూడా ఒకరు. మూస పద్దతిలో కాకుండా విభిన్నమైన చిత్రాల్లో చేస్తు ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'నిత్యామీనన్' తో కలిసి 'కాదలీక్క నెరమిల్లై' తో సందడి చేసాడు. జయం రవి, ఆయన భార్య ఆర్తి గత ఏడాది సెప్టెంబర్ లో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కేసు కోర్టు పరిధిలో ఉంది. రీసెంట్ గా జయం రవి తన స్నేహితురాలిగా పిలవబడుతున్న ప్రముఖ సింగర్ 'కెనిషా'(Kenishaa)తో కలిసి 'తిరుమల(Tirumala)కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని' దర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రీసెంట్ గా 'ఆర్తి'(Aarti)ఇనిస్టాగ్రమ్(Instagram)వేదికగా 'నువ్వు ఇతరులని మోసం చెయ్యవచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. 'కానీ దేవుడ్ని మోసం చెయ్యలేవు' అని ఇనిస్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారగా, రవి, కెనిషా ని ఉద్హేశించే ఆర్తి సదరు పోస్ట్ చేసిందని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇనిస్టా లో 'ఉత్తమ తల్లి తండ్రులు తమ పిల్లల గురించే ఆలోచిస్తారు. ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకి అర్హులు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుకోండనే నోట్ షేర్ చేసింది.
జయం రవి, ఆర్తి కి 2009 లో వివాహం జరగగా,అరవ్, అయాన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అరవ్ బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో కనిపించాడు. జయం రవి ప్రస్తుతం కార్తీ బాబు, జెనీ,పరాశక్తి, వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు.జయం రవి తండ్రి ప్రముఖ అగ్ర నిర్మాత ఎడిటర్ మోహన్ అనే విషయం తెలిసిందే. హిట్లర్, బావబావమరిది, మనసిచ్చి చూడు, మామగారు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలని నిర్మించాడు. జయం రవి సోదరుడు మోహన్ రాజా(Mohanraja)దర్శకుడుగా తన సత్తా చాటుతు, చిరంజీవి(Chiranjeevi)తో 'గాడ్ ఫాదర్' ని తెరకెక్కించాడు.
.webp)
![]() |
![]() |