![]() |
![]() |

మెగా హీరో వరుణ్ తేజ్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాక్సర్ గా కనిపించనున్నాడు. అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరెకెక్కుతున్న 'F3' సినిమా చేస్తున్నాడు. అంతేకాదు వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టాడని తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సమయాన్ని వృథా చేయకూడదని భావించిన వరుణ్ తేజ్ తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడట. తాజాగా ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడ వేగ’తో సూపర్ హిట్ ను అందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్లు ప్రచారం సాగుతోంది. కథ ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మొత్తం లండన్ లోనే జరగనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే వరుణ్ తో ప్రాజెక్టు చేసేందుకు ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు వరుణ్ తేజ్ చేస్తోన్న గని, F3 చిత్రాల షూటింగ్ కూడా పూర్తవుతుందని ఆయన భావిస్తున్నారట.
![]() |
![]() |