![]() |
![]() |

హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో ఏకంగా పదిమందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. తమది ఉమ్మడి కుటుంబం అని, తమ ఇంట్లో పది మందికి కరోనా సోకిందని డింపుల్ హయతి సోషల్ మీడియాలో భావోద్వేగభరిత పోస్ట్ చేసింది. ఇందులో తన తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. తమ కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని.. వారం రోజులుగా శారీరకంగా, మానసికంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది.
డింపుల్ హయాతి తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడి మూవీలో నటిస్తోంది. ఈమె స్వస్థలం తమిళనాడు కాగా, షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. అదే సమయంలో తమిళనాడులో లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక్కడే ఇరుక్కుపోయింది. తన కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతోన్న సమయంలో వారి వెంట లేనందుకు డింపుల్ హయాతి బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితులలో వారికి దూరంగా ఉండడం,వారి ఆరోగ్య పరిస్థితిని తలచుకుంటే బాధ కలుగుతుందని పేర్కొంది.
![]() |
![]() |