![]() |
![]() |

`ఛలో`, `భీష్మ` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వెంకీ కుడుముల. త్వరలో ఈ యువ దర్శకుడు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇందులో `ఫిదా` పోరి సాయిపల్లవి నాయికగా నటించబోతోందంటూ ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోందని బజ్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి మెలోడీబ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతమందించనున్నట్లు తెలిసింది. వెంకీ గత రెండు చిత్రాలు `ఛలో`, `భీష్మ`కి మహతి అందించిన బాణీలు బాగా ప్లస్సయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. మహతితో ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట వెంకీ. అదే గనుక నిజమైతే.. వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అటు వెంకీకి, ఇటు మహతికి ఇదే ఫస్ట్ కాంబినేషన్ మూవీ అయ్యే అవకాశముంది. త్వరలోనే వరుణ్ - వెంకీ మూవీలో మహతి స్వర సాగర్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |