![]() |
![]() |

సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే అంటే ఆ రోజు సందడే సందడి. ప్రస్తుతం ఆయన సినిమాల్లో నటించకపోవచ్చు గాక.. ఆయన అభిమానులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా ఆరోజును సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇక కృష్ణ ఇల్లు కూడా కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కళకళలాడిపోతూ ఉంటుంది. అందరూ ఆ రోజు కలిసి భోజనం చేస్తుంటారు. ఈసారి కృష్ణ పుట్టినరోజు ఆయన చిన్నకుమార్తె పద్మినీ ప్రియదర్శిని ఇంట్లో సందడిగా జరిగాయి.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. భార్య ఇందిరాదేవి నోట్లో కేక్ ముక్క పెడుతున్న కృష్ణ ఫొటో అయితే మరింతగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇందిరాదేవితో కృష్ణ సన్నిహితంగా మెలిగే సందర్భాలు బహు అరుదు. ఎన్నడో పాతకాలం నాటివి తప్పితే, అసలు ఆ ఇద్దరూ కలిసున్న ఫొటోలు బయటకు రావడం జరగదు. ఇప్పుడు కూడా ఆమె కృష్ణ దగ్గర కాకుండా చిన్నకూతురు దగ్గరే ఉంటున్నారు. అందుకే అక్కడ కృష్ణ బర్త్‌డే వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలో కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుళ్లు జయదేవ్, సంజయ్ స్వరూప్, సుధీర్‌బాబు, విజయనిర్మల కుమారుడు నరేశ్, మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. కృష్ణ కుమారులు రమేశ్ ఫ్యామిలీ, మహేశ్ ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.
.jpg)
![]() |
![]() |