![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం `ఖైదీ`. హీరోయిన్ - రొమాంటిక్ సాంగ్స్ - కామెడీ.. ఇలాంటి వాణిజ్యాంశాలు లేకున్నా తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిందీ యాక్షన్ థ్రిల్లర్. లోకేశ్ కనకరాజ్ రూపొందించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి త్వరలో సీక్వెల్ రానుంది. అంతేకాదు.. 2022లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సీక్వెల్ లో కార్తి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి చోటుంటుందని.. అతని గతంలో కథానాయిక పాత్రకి కూడా స్కోప్ ఉంటుందని.. ఆ పాత్రలో ఓ పాపులర్ హీరోయిన్ నటించే అవకాశముందని తెలిసింది. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
కాగా, ప్రస్తుతం కార్తి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి `అభిమన్యుడు` ఫేమ్ పి.ఎస్. మిత్రన్ రూపొందిస్తున్న `సర్దార్` కాగా.. మరొకటి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ `పొన్నియన్ సెల్వన్`. ఈ రెండింటిలోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో నటిస్తున్నారు కార్తి.
![]() |
![]() |