![]() |
![]() |
.jpg)
ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం (మే 31) తన పెళ్లి వార్తను ప్రణీత ప్రకటించడం చూసి, ఆమె అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన వేడుకలో బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును మే 30న ఆమె వివాహం చేసుకుంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రత్యేక వేడుకకు ఆహ్వానించలేకపోయినందుకు అందరికీ క్షమాపణలు తెలిపింది ఈ 'అత్తారింటికి దారేది' తార.
సోషల్ మీడియాలో ప్రణీత, నితిన్ రాజు పెళ్లి ఫొటోలు ప్రత్యక్షమవడంతో ప్రణీత పెళ్లి వార్త వైరల్‌గా మారింది. ఆ పెళ్లికి హాజరైన ఆమె స్నేహితుల్లో ఒకరు ఈ పిక్చర్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వెంటనే తన పెళ్లికి అందరినీ పిలవలేకపోయినందుకు క్షమాపణలు తెలియజేస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ స్టేట్‌మెంట్‌ను షేర్ చేసింది ప్రణీత.
.jpg)
"చాలా కొద్దిమంది సన్నిహితుల మధ్య 2021 మే 30న మేం పెళ్లిచేసుకున్నామని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి ఖరారు తేదీ గురించి మీకు తెలియజేయనందుకు ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఎందుకంటే పెళ్లి చేసుకొనే ముందు రోజు వరకూ కొవిడ్ నిబంధనల మధ్య పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయం మాకే తెలీదు. మా పెళ్లి తేదీల విషయంలో ఎక్కువ కాలం మిమ్మల్ని అస్పష్టతలో ఉంచడం మాకు ఇష్టం లేదు. దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండి. మాకు ప్రియమైనవాళ్లు మా స్పెషల్ డేలో భాగం కావడం కంటే మేం ఎక్కువ ఏం కోరుకుంటాం. మీరు మాకెంతో కావాల్సిన వారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. ప్రేమతో, మీ ప్రణీత-నితిన్." అని ఆ నోట్‌లో రాసుకొచ్చిందామె.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన ప్రణీత, నితిన్ కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకరించడంతో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. మహమ్మారి కారణంగా, బెంగళూరు శివార్లలో నిరాడంబరంగా జరిగిన వేడుకలో వారు దంపతులుగా మారారు.
![]() |
![]() |