![]() |
![]() |

పేరుకి ఉత్తరాది అమ్మాయే అయినా.. తెలుగులో చక్కగా మాట్లాడేస్తుంటుంది తమన్నా భాటియా. `శ్రీ` (2005)తో తెలుగునాట నటనకు శ్రీకారం చుట్టిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. అనతికాలంలోనే తెలుగు భాషపై పట్టు సాధించింది. అంతేకాదు.. అవకాశం దక్కినప్పుడల్లా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ మధ్య `ఊపిరి`, `ఎఫ్ 2` వంటి విజయవంతమైన చిత్రాల్లో తన తెలుగు పలుకులతో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసిందీ మిల్కీ బ్యూటీ. అలాగే, నటిగా పరిపూర్ణతను పొందింది.
కట్ చేస్తే.. తన నుంచి రాబోయే కొత్త చిత్రాలకి కూడా డబ్బింగ్ ప్రక్రియని కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది తమన్నా. అందులో భాగంగా.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`లోనూ సొంత
గాత్రంతో సందడి చేయనుందట. అంతేకాదు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన `సీటీమార్`లోనూ తన గొంతు వినిపించబోతోందట. మరి.. తమన్నా చేస్తున్న ఈ ప్రయత్నాలు మంచి ఫలితాలను అందిస్తాయేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం తమన్నా చేతిలో `ఎఫ్ 3`, `సీటీమార్`తో పాటు `మాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం`, `దటీజ్ మహాలక్ష్మి`, `బోల్ చుడియాన్` (హిందీ) చిత్రాలు ఉన్నాయి.
![]() |
![]() |