![]() |
![]() |
.webp)
ఖచ్చితంగా పోసాని కృష్ణ మురళి(posani krishna murali)ఒక మంచి రచయిత, మంచి నిర్మాత, మంచి దర్శకుడు,అంతకు మించి మంచి నటుడు. వాటిల్లో ఏ ఒక్కటి అబద్దం కాదు. ఆయన పెన్ను ప్రవాహం యొక్క ఉదృతం దాటీకి తెలుగు సినిమా నూతనత్వాన్ని సంతరించుకున్న సందర్భాలు ఎన్నో. తెలుగు సీమలో ఉన్న దాదాపు అందరి అగ్ర హీరోల నోటి వెంట ఆయన రాసిన మాటలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళ సినిమాల్లో వాళ్లనే తలదన్నేలా ముఖ్య పాత్రలు కూడా పోషించాడు. దీన్ని బట్టి ఆయన సినీ ప్రస్థానాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక పోసాని గురించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పోసాని 2009 లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసాడు.ఆ తర్వాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరి వైసీపీ అంటే పోసాని, పోసాని అంటే వైసీపీ అనే విధంగా తన ప్రవర్తనని సెట్ చేసుకున్నాడు. దీంతో ఆయనకీ సినిమాల్లో అవకాశాలు తగ్గాయనే ప్రచారం జరిగింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో మెజార్టీ నటులు తెలుగు దేశం సానుభూతిపరులు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కావడంతో సపోర్ట్ గా నిలుస్తుంటారు. ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టడంతో ఆ వైపు అనే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువే. దీంతో పోసాని కి సినిమా అవకాశాలు తగ్గాయనే ప్రచారం జోరందుకుంది.కానీ వాస్తవాన్ని చూసుకుంటే 2019 నుంచి 2024 వరకూ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోసాని చాలా చిత్రాలకి పైగానే చేసాడు. వాటిల్లో అగ్ర హీరోలైన చిరంజీవి(chiranjeevi)బాలకృష (balakrishna)సినిమాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ కి ముహూర్తం దగ్గర పడేకొద్దీ జగన్ మెప్పు కోసం తల్లి లాంటి సినిమా పరిశ్రమ మీద, హీరోల మీద ఆరోపణలు చేస్తు వచ్చాడు.అప్పటినుంచి పెద్ద హీరోల సినిమాలు రావడం మానేశాయి.పైగా బడా బ్యానర్స్ లో సినిమాలు కూడా రాలేదు అదంతా పోసాని చేసుకుందే. రాజకీయాలు వేరు సినిమాలు వేరని మొదటి నుంచి సినిమా పెద్దలు చెప్తూనే ఉన్నారు. కానీ పోసాని ఇష్టానుసారంగా సినిమా హీరోల మీద విమర్శలు గుప్పించాడు.పైగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చెయ్యడంతో పవన్, బాలయ్య, చంద్రబాబు నాయుడు ని ఎంతో జుగుప్త్సా కరమైన మాటలు కూడా అన్నాడు. పాపం పోసానికి తెలియని విషయం ఏంటంటే హీరోలకి అభిమానులు గా మారేది ప్రేక్షకులే కాదు. సినిమాని తెరకెక్కించే వాళ్ళు కూడా. మధ్య మధ్య లో కొన్ని చోటా సినిమాలు చేసాడు. కానీ వాటి టైటిల్స్ పోసానికి కూడా తెలియదు.
ఇక సోషల్ మీడియాలో పోసానికి సినిమా అవకాశాలు తగ్గుతాయనే న్యూస్ చూసిన చాలా మంది తగ్గాలనే కోరుకుంటున్నారు. నూటికి నూరు శాతం వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఉంది. మాటలు కోటలు దాటితే అవకాశం ఆమడ దూరం ఉంటుంది. ఇక వైసిపీ పతన దశ ప్రజల కళ్ళల్లో కనపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అన్నం పెట్టిన సినిమాకి మంచి చేసింది లేదు. చెడే ఎక్కువ చేసాడు. ఈ విషయం అందరకి తెలుసు.
![]() |
![]() |