![]() |
![]() |

మూవీ : కల్కి
నటీనటులు: టొవినో థామస్, సంయుక్త మీనన్, సుధీష్, శివాజిత్ పద్మనాభన్, హరీష్ ఉత్తమన్
ఎడిటింగ్: రంజిత్
సినిమాటోగ్రఫీ: గౌతమ్ శంకర్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
నిర్మాతలు: సువిన్ కె. వర్కయ్
దర్శకత్వం: ప్రవీణ్ ప్రభారామ్
కథ :
ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని నంజన్ కొట్టైలో అమర్‌నాథ్ అనే రౌడీ ఉంటాడు. అతను చేసే గుండాయిజానికి రాజకీయ పలుకుబడి కూడా ఉండటంతో అతనికి అడ్డుగా ఎవరు నిలబడలేకపోయేవారు. కేంద్రమంత్రి విజయానంద్ కూడా అమర్‌నాథ్ కి సహాయంగా ఉంటాడు. లోకల్ గా అమర్‌నాథ్ కి కావల్సిన పనులు చేయడానికి అతని దగ్గర ఉమర్ (హరీశ్ ఉత్తమన్) పనిచేస్తుంటాడు. ఇక అమర్‌నాథ్ తన తమ్ముడైన అప్పు (విని విశ్వ లాల్)ను మంత్రిని చేయాలనే ఆలోచనలో ఉంటాడు. విజయానంద్ కూతురైన సంగీత (సంయుక్త మీనన్)కి తాను మంత్రిని కావాలనే ఒక కోరిక ఉంటుంది. ఇక తమిళ ప్రాంతం నుంచి వచ్చిన వలసదారులకు నంజన్ కోటలో స్థానం లేదని ఊరు అవతలకి అమర్‌నాథ్ తరిమేస్తాడు. అక్కడి మురికివాడలోనే వాళ్లంతా గుడిసెలు వేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తమిళ వలసదారులు 'నంజన్ కోట'లో సౌంకర్యవంతంగా జీవించే హక్కు ఉందంటూ వాళ్ల తరపున సూరజ్ (సైజూ కురుప్) పోరాటం చేస్తుంటాడు. ఇదే విషయంపై పోరాడిన అడ్వకేట్ లక్ష్మణ్ .. ఎస్ ఐ వైశాఖ్ చనిపోవడానికి అమర్‌నాథ్ కారకుడవుతాడు. ఇలా నంజన్ కోటలోని పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ గా అక్కడ కల్కి (టోవినో థామస్) ఛార్జ్ తీసుకుంటాడు. అమర్నాథ్ గ్యాంగ్ కి తన మార్క్ యాక్షన్ చూపిస్తూనే అతను డ్యూటీలో జాయిన్ అవుతాడు. అమర్‌నాథ్ ఏం చేస్తాడు? ఫలితంగా కల్కి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? కల్కి ఆ గ్రామానికి పోలీస్ ఆఫీసర్ గా రావడానికి కారణం ఏమిటి అనేది మిగతా కథ.
విశ్లేషణ:
రాజకీయ నాయకులు ఆడే చదరంగంలో ఎంతోమంది సామాన్యులు, పోలీసులు బలి అవుతుంటారు. అయితే కొన్ని సరిహద్దు ప్రాంతాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూపిస్తూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ కల్కి లో కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో ఇది పవర్ ప్యాక్ మూవీగా రిలీజైంది.
ఫోరెన్సిక్, 2018, అన్వేషిప్పన్ కండేతుమ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన టొవినో థామస్ వన్ మ్యాన్ షోగా ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమాలో ఎలవేషన్స్ హీరో క్యారెక్టర్ ని అమాంతం పెంచేశాయి. అయితే కథ అందరికి తెలిసినదే కావడంతో మాములుగా అనిపిస్తుంది. మొదటి ఇరవై నిమిషాల వరకు కథలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు.. ఆ తర్వాత హీరో రావడం అన్యాయాన్ని ఎదురించడం.. రౌడీలకి వార్నింగ్ ఇవ్వడం.. ఇలాంటి సీన్లు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. అయితే సెకెంఢాఫ్ లో కథ నెమ్మదిగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్ ని ఆడ్ చేయాలని బలవంతంగా కొన్ని సీన్లని చూపించారు దర్శకుడు.
ఇక సినిమా చివరలో వర్షంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. అయితే ఇందులో హీరోకి రక్తాలొచ్చేలా కత్తిపోట్లు పడతాయి. అయినా సరే రౌడీలని కొట్టే కొన్ని షాట్స్ తేలిపోయాయి. మనకి ఈ ఫైట్ చూస్తుంటే మిర్చి, నా పేరు శివ, రెబల్ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో ఎంటర్‌టైన్మెంట్ కరువైంది. కామెడీ లేకపోవడంతో కథ సినిమా మొత్తం ఫైట్లు, ఒకరిపై ఒకరు దాడి ఇవే చూడటం అంటే కష్టమే కదా.. ఇదే సినిమా నాలుగు సంవత్సరాల క్రితం వస్తే బాగుండేది. ఓ సినిమా తీసి చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అయితే ఓపిక చాలా అవసరం. గౌతమ్ శంకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ పర్వాలేదు. రంజిత్ ఎడిటింగ్ ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ లో కొన్ని స్లో సీన్లు తీసేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
'కల్కి'గా టొవినో థామస్ పోలీస్ ఆఫీసర్ గా సరిగ్గా సరిపోయాడు. సంయుక్త మీనన్ కి పెద్దగా స్క్రీన్ స్కేస్ లేదు. అమర్ నాథ్ పాత్రలో చేసిన శివజిత్ ఆకట్టుకున్నాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : యాక్షన్ సీన్స్ , ఎలవేషన్స్ బాగున్నప్పటికి రోటీన్ గా సాగే కథ ఇది. వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |