![]() |
![]() |
.webp)
ఇక ప్రతి శుక్రవారం ,శనివారం రాత్రి ఏడు గంటల నుంచి తెలుగు సినిమా మ్యూజిక్ లవర్స్ ని ఎవరు డిస్ట్రబ్ చెయ్యడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రెండు రోజులు సంగీత ప్రవాహంలో తేలియాడనున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా డోంట్ డిస్ట్రబ్ అని అంటారు.
తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ( Telugu Indian idol season 3) తిరిగి ల్యాండ్ అవ్వనుంది. ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహా లో జూన్ 14 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రతి శుక్ర, శనివారం రాత్రి 7 గంటలకు పాటల సునామీతో ముంచనుంది. గత రెండు సీజన్లకు మించి ఇప్పుడు మూడో సీజన్ ఉండబోతుంది. ఇందుకు నిదర్శనంగా సీజన్ 3 ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. శ్రీరామ చంద్ర వైబ్రెంట్ ఎంట్రీతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఎంతో ఉత్సాహంతో ఆకట్టుకుంది. ఇక జడ్జిలుగా కనిపించబోతున్న లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, స్టార్ సింగర్స్, కార్తిక్, గీతా మాధురి ప్రజెన్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది.అదే విధంగా తమన్ మరోసారి తన సెన్సాఫ్ హ్యుమర్ తో నవ్వులు పూయించాడు.

టోటల్ గా ప్రోమో ని చూస్తున్నంత సేపు ఈసారి మ్యూజికల్ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందనే విషయం అర్ధమవుతుంది. ప్రోమో గ్లింప్స్ లో కంటెస్టెంట్స్ వినిపించిన కొన్ని పాటలు షో మీద అందరిలో ఎగ్జైట్మెంట్ ని పెంచాయి గత రెండు సీజన్ లు విజయం సాధించినట్టే సీజన్ 3 కూడా విజయం సాదిస్తుందని ఆహా యాజమాన్యం భావిస్తుంది.
![]() |
![]() |