![]() |
![]() |
.webp)
నూటికి నూరు శాతం హీరోకి కావలసిన అన్ని క్వాలిటీస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun tej) లో ఉన్నాయి. ముకుంద తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో మంచి సినిమాల్లో అధ్బతమైన పాత్రలని పోషించాడు. కానీ హిట్స్ మాత్రం ముఖం చాటేస్తున్నాయి. ఇప్పటి వరకు పదమూడు చిత్రాలకి పైనే చేసాడు. ఫిదా, గద్దల కొండ గణేష్, తొలిప్రేమ, ఎఫ్ 2 లు మాత్రమే హిట్ గా నిలిచాయి. ఇటీవల ఎన్నో ఆశలతో చేసిన గాండీవదారిఅర్జున, ఆపరేషన్ వాలైంటైన్ పరాజయం పాలవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలో ఇక రెస్ట్ కి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.
వరుణ్ లిస్ట్ లో ప్రస్తుతం మట్కా(matka)అనే మూవీ ఉంది. కరుణకుమార్ దర్శకుడు. లాస్ట్ ఇయర్ లోనే మూవీ ప్రారంభం అయ్యింది. కొంత కాలం నుంచి షూటింగ్ ని జరుపుకోవడం లేదు. పైగా ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. రీసెంట్ గా అప్ డేట్ వచ్చింది. జూన్ 12 నుంచి షూటింగ్ మొదలు కానుందనే సమాచారం వినబడుతుంది. ఏకంగా నలభై రోజుల పాటు భారీ షెడ్యూల్ జరుపుకోనుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విశాఖ పట్నం పాత రోజుల్లో ఎలా ఉండేదో అలాంటి సెట్ ని వేస్తున్నారు. ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా అత్యంత భారీ వేయటంతో ఆ సెట్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఇక మట్కా .పక్కా మాస్ అండ్ హై వోల్టేజ్ మూవీగా తెరకెక్కుతుంది.ఇప్పటికే మూవీ నుండి వచ్చిన వరుణ్ స్టిల్స్ మూవీ మీద అంచనాలని పెంచింది. పైగా కరుణ కుమార్ (karuna kumar) లాంటి విభిన్న దర్శకుడు కావడంతో మట్కా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. వరుణ్ అండ్ మెగా ఫ్యాన్స్ అయితే మట్కా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వ రుణ్ కి ఈ విజయం పక్కా అవసరం కూడాను..గుంటూరు కారం లో మహేష్ తో ఆడిపాడిన మీనాక్షి చౌదరి (meenakshi chowdary)వరుణ్ తో ఆడిపాడనుంది. వైరా ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుండగా నవీన్ చంద్ర, నోరా ఫతేహి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
![]() |
![]() |