![]() |
![]() |

`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేకాదు.. `ఆర్ ఎక్స్ 100`
అందించిన క్రేజ్, ఇమేజ్ తో మరికొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంది. అలాగే విక్టరీ వెంకటేశ్ (వెంకీమామ), మాస్ మహారాజా రవితేజ (డిస్కో రాజా) వంటి సీనియర్ స్టార్స్ సరసన కనువిందు చేసింది.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరో సీనియర్ హీరోతో చిందులేయనుందట పాయల్. ఆ వివరాల్లోకి వెళితే.. `సోగ్గాడే చిన్ని నాయనా` (2016)కి సీక్వెల్ గా `బంగార్రాజు` పేరుతో కింగ్ నాగార్జున ఓ
మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూలై నుంచి పట్టాలెక్కనుంది. కాగా, ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం పాయల్ స్టెప్పులేయనుందట. పాయల్ పాట సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని సమాచారం. త్వరలోనే `బంగార్రాజు`లో పాయల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. ఈ స్పెషల్ సాంగ్ పాయల్ కి మరిన్ని డాన్స్ నంబర్స్ ని అందిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. 2022 సంక్రాంతికి `బంగార్రాజు` థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |