![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ శరత్‌కుమార్ వారసురాలిగా 'పోడా పోడి' (2012) మూవీలో శింబు సరసన నాయికగా నటించడం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వరలక్ష్మీ శరత్‌కుమార్. మరో ఏడు సంవత్సరాలకు గానీ ఆమె తెలుగులో నటించలేదు. ఆ సినిమా.. జి. నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్'. సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన ఆ మూవీలో వరలక్ష్మీదేవి అనే కీలక పాత్రలో ఆమె నటించారు. ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆమె నటన వెలుగులోకి రాలేదు.
అయితే 2021లో వచ్చిన రెండు సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువ అయ్యారు. ఆ సినిమాలు.. రవితేజ 'క్రాక్', అల్లరి నరేశ్ 'నాంది'. 'క్రాక్'లో జయమ్మ అనే నెగటివ్ రోల్లో, 'నాంది'లో లాయర్ ఆద్య అనే పాజిటివ్ రోల్లో ఆమె ప్రదర్శించిన నటన ప్రేక్షకులనూ, విమర్శకులనూ బాగా మెప్పించారు. దీంతో తెలుగు దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే హీరోయిన్గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక డిమాండ్ పెరిగిన వరలక్ష్మి ప్రస్తుతం తమిళంలో ఏకంగా ఆరు సినిమాలు చేస్తున్నారు. తెలుగులో సందీప్ కిషన్‌తో మరోసారి నటిస్తున్నారు.

ప్రస్తుతం వరలక్ష్మి ఒక్కో సినిమాకు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగులో నటించడానికైతే మరింత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చాలా మంది హీరోయిన్ల కంటే ఇప్పుడు వరలక్ష్మి రెమ్యూనరేషన్ ఎక్కువనేది గమనించాలి. అయినప్పటికీ ఆమె ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సరేనంటున్నారంట. 2014 లెక్కల ప్రకారమే వరలక్ష్మి పేరిట ఉన్న నికర ఆస్తుల విలువ రూ. 38 కోట్లు. ఇప్పుడు ఆమె సంపద మరింత పెరిగింది.
![]() |
![]() |