![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ప్రస్తుతం 'ఓజి'(Og)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై పూర్తి స్థాయిలో పవన్ తన మానియాని ప్రదర్శించాడనే టాక్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి వినపడుతుంది. అసలు మొదట నుంచి 'ఓజి' సూపర్ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతు వస్తున్నారు. పైగా పవన్ ని పేరు పెట్టి పిలవడం బదులు ఓజి అని పిలుచుకుంటు వస్తున్నారు. దీన్ని బట్టి అభిమానుల్లో 'ఓజి' ఎంత బలంగా నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
దీంతో నిన్న రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ కి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కోవలోనే బెంగుళూరు నగరంలోని' KRపురం' థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోకి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వారిలో కొంత మంది 'ఓజి' లో పవన్ కత్తి పట్టుకొని ఉన్న గెటప్ తో వచ్చారు. పెద్ద పెద్దగా అరుస్తు స్క్రీన్ ముందుకు గంతులేస్తున్నారు.ఒక అభిమాని కత్తితో స్క్రీన్‌ని చింపేయడంతో థియేటర్ లో ఉన్న వారంతా షాక్ కి గురయ్యారు. థియేటర్ యాజమాన్యం కూడా షో ని నిలిపివేసి, భద్రతా సిబ్బంది అభిమానుల్ని థియేటర్ బయటకి పంపించారు. ఆ తర్వాత యధావిధిగా షో ని ప్రారంభించారు.
ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు తమ అభిమానాన్ని వేరే మార్గాల ద్వారా చూపించుకోవాలి కానీ, ఇతరులకి ఇబ్బంది కలిగేలా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |