![]() |
![]() |

సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ' విడుదల కానుంది. ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సంచలన ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ సేల్స్ పరంగా ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా లాంగ్ రన్ పై 'కాంతార చాప్టర్ 1' ప్రభావం పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (OG vs Kantara Chapter 1)
'ఓజీ' వచ్చిన వారానికే అక్టోబర్ 2న 'కాంతార చాప్టర్ 1' విడుదల కానుంది. 2022లో వచ్చిన 'కాంతార' పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే వసూళ్ళు రాబట్టింది. 'కాంతార'కి ప్రీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో 'కాంతార చాప్టర్ 1'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగునాట ఈ సినిమా బిజినెస్ ఏకంగా 'కేజీఎఫ్-2'ని మించి జరిగినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాయి. దీంతో విడుదల భారీస్థాయిలోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇది చాలదు అన్నట్టు.. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మద్దతు కూడా 'కాంతార చాప్టర్ 1'కి లభించేలా ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఏకంగా మూడు నెలల ముందుగానే.. అంటే అక్టోబర్ 1న ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, అక్టోబర్ 2 నుంచి 'కాంతార చాప్టర్ 1' విడుదలవుతున్న థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారట. దీంతో 'రాజా సాబ్' ట్రైలర్ ను బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం.. ప్రభాస్ అభిమానులు 'కాంతార చాప్టర్ 1' థియేటర్లకు వెళ్ళే అవకాశముంది. అసలే ప్రీక్వెల్ హైప్, దానికితోడు ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడైతే.. 'ఓజీ' లాంగ్ రన్ పై 'కాంతార చాప్టర్ 1' ఎఫెక్ట్ పడుతుందనే డౌట్స్ వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ తన స్టార్డంతో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |