![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'డ్రాగన్' (Dragon) అనే యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్-నీల్ కాంబో కావడంతో ప్రకటనతోనే 'డ్రాగన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి వినిపిస్తున్న ఒక్కో న్యూస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇక ఇప్పుడు మరో సంచలన వార్త బలంగా వినిపిస్తోంది. 'డ్రాగన్'లో ఓ పాన్ ఇండియా హీరో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. రిషబ్ శెట్టి.
'కాంతార'తో హీరోగా, డైరెక్టర్ గా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. అక్టోబర్ 2న 'కాంతార చాప్టర్ 1'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకి రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 'కాంతార చాప్టర్ 1' తర్వాత కూడా రిషబ్ శెట్టి లైనప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సితార బ్యానర్ లో ఓ భారీ పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే 'జై హనుమాన్', 'ఛత్రపతి శివాజీ బయోపిక్' వంటి భారీ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రిషబ్.. 'డ్రాగన్'లో గెస్ట్ రోల్ చేస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ తో రిషబ్ కి మంచి అనుబంధముంది. ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే.. రిషబ్ ఆతిథ్యం ఇవ్వడం చూశాం. ఇద్దరూ బ్రదర్స్ లా ఉంటారు. ఎన్టీఆర్-రిషబ్ బాండింగ్ చూసి.. 'కాంతార' ఫ్రాంచైజ్ లో ఎన్టీఆర్ భాగమవుతున్నట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా.. ఎన్టీఆర్ సినిమాలోనే రిషబ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త తెరపైకి వచ్చింది. ఇది నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు.
![]() |
![]() |