![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి( chiranjeevi)హీరో స్టేజ్ ని దాటుకొని తెలుగు ప్రజల కుటుంబ సభ్యుడుగా మారి సుదీర్ఘ కాలం అవుతుంది. అదే విధంగా అభిమానుల స్థానంలో భక్తులు ఏర్పడి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. టు డే చిరు ఏం చేస్తున్నాడని ఆలోచించేవాళ్ళు లక్షల్లోనే ఉంటారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తు చిరు ఆ ఘనతని సాధించాడు. చిరు సాయానికి ఎల్లలు ఉండవు. సినిమా వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకి కూడా ఎంతో సాయం చేసారు. ఆ విలువ లక్షలు కోట్ల రూపాయిల దాకా ఉంటుంది.కానీ ఏనాడూ చెప్పుకోరు. ప్రకృతి మాత్రం వేరే వాళ్ళకి ఇన్ స్ప్రేషన్ అవ్వాలని ప్రపంచానికి తెలియచేస్తుంది. అలా రీసెంట్ గా ఒక సాయం బయటకి వచ్చింది.
ప్రభు(prabhu)సినిమా ఇండస్ట్రీ చెన్నై లో ఉన్నప్పట్నుంచి ఫిలిం జర్నలిస్ట్ గా కళామ తల్లికి తన వంతు సేవలందిస్తు వస్తున్నారు. సినిమా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన జెనరల్ మెడికల్ చెకప్ చేయించుకోగా హార్ట్ లో ఎనభై శాతం బ్లాకులు ఉన్నాయని తెలిసింది. దీంతో చిరంజీవిని సంప్రదించి విషయాన్నీ తెలియచేసాడు. చిరు వెంటనే హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో ప్రభుని జాయిన్ చెయ్యడం జరిగింది.అంతే కాకుండా చిరునే దగ్గరుండి అన్ని ఎరేంజ్ మెంట్స్ చేయించి ప్రభు చేత పైసా ఖర్చు కూడా పెట్టించలేదు. ఎలాంటి బైపాస్ సర్జరీ లేకుండా స్టంట్స్ వేసి డాక్టర్స్ ప్రభు ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ప్రభు ఆరోగ్యం బాగానే ఉంది. సమయానికి హాస్పిటల్ లో జాయిన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్స్ చెప్పారు. మెగా స్టార్ తీసుకున్న చొరవ వల్లే ప్రభు ప్రాణాలు దక్కాయి.

తెలుగు సినిమా ఫిల్మ్ జర్నలిస్ట్ ఈ సందర్భంగా చిరు కి ధన్యవాదాలు తెలియచేసింది.ఇక చిరు కి ప్రభు కి మధ్య ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రభు కూతురు పెళ్ళికి కూడా చిరు హాజరయ్యాడు. చిరు కి సంబంధించిన ఎన్నో ఇంటర్వూస్ కి ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. చిరు ప్రస్తుతం విశ్వంభర(vishwambhara)తో బిజీగా ఉన్నాడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతుంది
![]() |
![]() |