![]() |
![]() |

తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాలని మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. ఓటీటీలోకి ఏ కొత్త సినిమా వచ్చిన చూడాలని అనుకునేవారు పెరిగిపోయారు. థియేటర్లలో కంటే ఇంట్లో కుర్చొని సినిమాలని ఓటీటీలో చూడటం బెటర్ అని చాలా మంది చూస్తుంటారు.
కొన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలో భారీగా వీక్షకాధరణ పొందతున్నాయి. ఫోరెన్సిక్, అన్వేషిప్పన్ కండేతుమ్, బ్రహ్మయుగం లాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలోకి కన్నడ మూవీ వచ్చేసింది. అదే 'శాకాహారి'. కన్నడలో రూపొందిన ఈ సినిమాకి సందీప్ దర్శకుడు. రంగాయన రఘు సినిమాలో కీలక పాత్ర పోషించాడు. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే తదితరులు నటించారు. మర్డర్ మిస్టరీలో ఈ మూవీని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్బ లో ఈ వారమే అడుగుపెట్టగా అత్యదిక వీక్షకాధరణ లభించింది. కోటిరూపాయలలోపు బడ్జెతో నిర్మించిన ఈ 'శాకాహారి' అక్కడ థియేటర్లలో భారీ వసూళ్ళను రాబట్టుకుంది.
మరి అంతగా ఈ సినిమాలో ఏం ఉంది. సుబ్బన్న ఒక చిన్న శాకాహార హోటల్ నడుపుతుంటాడు. ఒకసారి వినయ్ అనే వ్యక్తిని పోలీసులు తరుముతూ రావడంతో.. అతను సుబ్బన్న హోటల్లో తలదాచుకుంటాడు. భార్య హత్యకేసు నుంచి పారిపోయి వచ్చిన ఆ వ్యక్తికి సుబ్బన్న ఆశ్రయం ఇస్తాడు. ఆ తర్వాత సుబ్బన్న లైఫ్ ఎలా మారిపోయింది ? సుబ్బన్న గతమేమిటి అనేది మిగతా కథ. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ మూవీని మీరు చూసేయ్యండి.
![]() |
![]() |