![]() |
![]() |

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలు కలిసి పోటీ చేశాయి. దీంతో నందమూరి, మెగా అభిమానులు బాగా దగ్గరయ్యారు. సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ.. రాజకీయాల పరంగా మాత్రం ఇరు కుటుంబాల అభిమానులు దాదాపు కలిసిపోయారు. ఇక రామ్ చరణ్ తదుపరి చిత్రం 'గేమ్ ఛేంజర్' దెబ్బకి.. మెగా, నందమూరి అభిమానులు మరింత దగ్గరయ్యే అవకాశముందని తెలుస్తోంది.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ ఫిల్మ్ లో.. తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో చరణ్ కనిపించనున్నాడు. తండ్రి రాజకీయ నాయకుడు కాగా, కొడుకు ఐఏఎస్ అధికారి అని సమాచారం.
తండ్రి పాత్రకి సంబంధించిన ఎపిసోడ్ సినిమాకే హైలైట్ నిలవనుందని అంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో.. సీనియర్ ఎన్టీఆర్ (NTR) స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రిఫరెన్స్ లు ఉంటాయట. ముఖ్యంగా టీడీపీ సింబల్ అయిన సైకిల్ ని హైలైట్ చేసేలా కొన్ని సీన్స్ ఉంటాయట. సైకిల్ మీద చరణ్ అసెంబ్లీకి వెళ్లే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. అలాగే అవినీతి మరక లేని ఎన్టీఆర్ పాలన, ప్రజా సంక్షేమ పథకాలు వంటివి.. ఇందులో ప్రస్తావిస్తారట.
ఇక ఈ సినిమాలోని కొడుకు పాత్ర పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని గుర్తు చేసేలా ఉంటుందట. ఎప్పుడూ ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆలోచించే నిజాయితీగల యువకుడు.. రాజకీయ ప్రక్షాళన ఎలా చేశాడు అనేది ఆ పాత్ర ద్వారా చూపించబోతున్నారట. ఆ పాత్ర పలికే ప్రతి సంభాషణ.. పవన్ ని గుర్తు చేయడం ఖాయమట.
మొత్తానికి 'గేమ్ ఛేంజర్'లో ఎన్టీఆర్ ని గుర్తుచేసేలా ఉండే ప్రజా నాయకుడి పాత్రలో తండ్రిగా, పవన్ కళ్యాణ్ ని గుర్తుచేసేలా ఉండే నిజాయితీగల అధికారి పాత్రలో కొడుకుగా రామ్ చరణ్ అలరించనున్నారని అంటున్నారు.
![]() |
![]() |